శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:28:02

‘వెలుగు’ కథనంతో మానసిక క్షోభకు గురయ్యా

‘వెలుగు’ కథనంతో మానసిక క్షోభకు గురయ్యా
  • ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాచర్యలు తీసుకోవాలి
  • ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తాను దందాలకు పాల్పడుతున్నట్టు ఈ నెల 10వ తేదీన వెలుగు దినపత్రిక ప్రచురించిన అవాస్తవ కథనంతో తీవ్ర మానసికక్షోభకు గురయ్యానని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ.. మరుసటిరోజే ఆ వార్త అవాస్తమంటూ సదరు పత్రికలోనే ప్రచురించినప్పటికీ.. ఈ విధంగా చేయడం తనకు ఎంతోబాధ కలిగించిందని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన బిడ్డనైన తనపై ఇలాంటి అసత్య ప్రచారంచేయడం మానసికంగా కుంగదీసిందన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ప్రచురితమైనందున ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక అక్రమాలకు తాను అడ్డుకట్ట వేశానని.. ముందస్తుగా విచారించకుండా అసత్య కథనాలు ప్రచురించడం బాధాకరమని చెప్పారు. మీడియారంగంపై ఉన్న గౌరవంతో ఇప్పటివరకూ ఆ పత్రికపై ఎలాంటి కేసు పెట్టలేదని, మళ్లీ ఇలాంటివి జరిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. ఆమె వెంట ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, ఆత్రం సక్కు ఉన్నారు.


logo