బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 01:47:06

లాక్‌డౌన్‌లోనూ వేధింపులు

లాక్‌డౌన్‌లోనూ వేధింపులు

  • మృగాళ్ల వికృత చేష్టలు
  • 255 ఫిర్యాదులు..28కేసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలోనూ మృగాళ్ల వికృత చేష్టలు ఆగలేదు. ఏప్రిల్‌, మే నెలల్లో షీ టీమ్స్‌కు దాదాపు 255 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి 28 కేసులు నమోదుచేశారు. అం దులో 19 క్రిమినల్‌, తొమ్మిది పెట్టీ కేసు లు ఉన్నాయి. హైదరాబాద్‌లో మంకీబీ జ్‌ పేరుతో మోడలింగ్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్న మణిచాకో తన కూతురికి వాణిజ్య ప్రకటనల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి ఫొటోషూట్‌ నిర్వహించాడని, ఆ సమయంలో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలి తండ్రి వాట్సాప్‌ ద్వారా షీటీంకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చే శారు. 

రహస్య భాగాలను కత్తిరించుకొని వీడియోకాల్‌లో చూపించాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేసిన యువకుడి ఆట కట్టించా రు షీటీమ్స్‌ పోలీసులు. మహిళ ఛాతిపై చెయ్యేసిన  ఎస్సార్‌నగర్‌కు చెందిన హో మియో డాక్టర్‌పై షీటీమ్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. 


తాజావార్తలు


logo