మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 15:38:15

గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది: కలెక్టర్‌ శశాంక

గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది: కలెక్టర్‌ శశాంక

కరీంనగర్: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆ నగర మేయర్‌ వై.సునీల్‌రావు విసిరిన హరిత చాలెంజ్‌ను శశాంక స్వీకరించారు. కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ చాలెంజ్‌ సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అయిన హరితహారం కార్యక్రమానికి ఎంతో దోహదపడుతుందన్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్కరూ మూడు మొక్కలు నాటి, సంరక్షించాలని కలెక్టర్‌ శశాంక పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆక్సిజన్‌ కొనుక్కునే పరిస్థితి రావొద్దనుకుంటే అందరూ తక్షణమే పర్యావరణంపై దృష్టిపెట్టాలన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. తలా మూడు మొక్కలు నాటాలని తన సహచరులు, సిబ్బందికి గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo