సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 12:43:49

మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు : ప్రకాష్‌రాజ్‌

మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు : ప్రకాష్‌రాజ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దీనిలో భాగంగా  సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ కూడా ట్విటర్ ద్వారా కేటీఆర్‌కు విషెస్ చెప్పారు. ‘డియర్ ఫ్రెండ్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు మరింత ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని కోరుకుంటున్నా.. ధన్యవాదాలు’  అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

సమస్యలు వచ్చినప్పుడు ప్రజల వెన్నుతట్టి నిలబడేవాడే నిజమైన నాయకుడని, తెలంగాణలో ఆ బాధ్యతను భుజానికెత్తుకున్న నాయకుడు మన కేటీఆర్ అని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసించారు. కేటీఆర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేకమైన వీడియోను కూడా ట్విటర్ పోస్ట్ చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo