రేవంత్‌కు పీసీసీ ఇస్తే.. కాంగ్రెస్‌లో ఉండలేం

- మీడియా చేసిన లీడర్ రేవంత్‌రెడ్డి
- తెలంగాణ ద్రోహి మల్కాజిగిరి ఎంపీ
- మీడియాను, హైకమాండ్‌ను మేనేజ్ చేశారు
- ప్రజల్లో రేవంత్ కంటే నాకే ఎక్కువ క్రేజ్
- బీసీలకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలి
- సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మీడియా, సోషల్ మీడియా చేసిన లీడర్ రేవంత్‌రెడ్డి అని, ఆయనకు పీసీసీ ఇస్తే కాంగ్రెస్‌లో ఉండలేమని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు పేర్కొన్నారు. సీనియర్లంతా ఎవరిదారివారు చూసుకుంటారని తెలిపారు. పీసీసీ విషయంలో సమాచారం ఉన్నందుకే రేవంత్‌పై విమర్శలు చేస్తున్నానని చెప్పారు. శుక్రవారం తన నివాసంలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయసేకరణలో భాగంగా తాను ఇచ్చిన ఆధారాలను అధిష్ఠానం వద్దకు చేరకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అడ్డుకొన్నారని ఆరోపించారు. ప్యాకేజీకి అమ్ముడుపోయిన ఆయన హైకమాండ్‌కు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మీడియాను, పార్టీ హైకమాండ్‌ను మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. పార్టీ కోసం పనిచేసే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి పనికిరారా? అని ప్రశ్నించారు.
టీడీపీలో ఉండి ఆ పార్టీనే ఖతం చేసిన వ్యక్తి రేవంత్ అని.. ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని చెప్పారు. తెలంగాణ వ్యతిరేకికి పీసీసీ ఎలా ఇస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్లో రేవంత్‌రెడ్డి కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉన్నదని వీహెచ్ చెప్పుకొన్నారు. తెలంగాణలో బీజేపీ పెరుగుతుంటే.. ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పీసీసీ ఇస్తారా? అని ప్రశ్నించిన వీహెచ్.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాను పనిచేయనని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డికి డబ్బులెలా వచ్చాయో తేల్చాలని పేర్కొంటూ సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు. పీసీసీపై ఉత్తమ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
రేవంత్ మాస్ లీడరే అయితే.. గ్రేటర్లో 48 సీట్లు తీసుకొని 2 స్థానాలు మాత్రమే ఎందుకు గెలిపించాడని నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడిని కలవాలంటే మేం జైలుకెళ్లాలా అని ఎద్దేవా చేశారు. మూడ్రోజుల నుంచి మాణిక్యం ఠాగూర్ తన ఫోన్ ఎత్తడం లేదని ఆరోపించారు. బీసీవ్యక్తి డీ శ్రీనివాస్ రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. కోమటిరెడ్డి మొదట్నుంచి కాంగ్రెస్‌లో ఉన్నాడని, తెలంగాణ కోసం పోరాటం చేశారని, అలాంటి వ్యక్తికి పీసీసీ పదవి ఇవ్వాలని హనుమంతరావు సూచించారు.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- 'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా