శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 17:22:25

మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపిన చేనేత కార్మికులు

మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపిన చేనేత కార్మికులు

వరంగల్‌ అర్బన్‌ : జనగామ జిల్లాలోని కొడ‌కండ్లకు మినీ టెక్స్ టైల్ పార్క్‌ను మంజూరు చేయించినందుకు కృత‌జ్ఞతగా కొడ‌కండ్ల మండ‌లానికి చెందిన ప‌లువురు చేనేత కార్మికులు  పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌ రావుకు ధన్యవాదాలు తెలిపారు. హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ప‌ల‌వురు చేనేత కార్మికులు మంత్రిని క‌లిశారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో అత్యధికంగా చేనేత కార్మికులు, మ‌ర మరమగ్గాలు ఉన్నది కొడ‌కండ్లలోనేనని వారు తెలిపారు. కాగా, త్వరలోనే మినీ టెక్స్ టైల్ పార్క్‌కు భూమి పూజ‌, శంకుస్థాప‌న చేయిస్తామ‌ని మంత్రి వారికి తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి


logo