గురువారం 09 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 00:50:09

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

బెజ్జూర్‌(పెంచికల్‌పేట): కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట మండలం ఆగర్‌గూడ వద్ద మంగళవారం రూ.77 వేల విలువైన నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుకున్నట్లు ఏడీఏ రాజులనాయుడు, ఎస్సై రమేశ్‌ తెలిపారు. బెజ్జూర్‌ మండలం తలాయి నుంచి నకిలీ విత్తన ప్యాకెట్లు తీసుకొస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రూ.77 వేల విలువైన 77 విత్తన ప్యాకెట్లతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకొని ధన్‌రెడ్డి సత్తిరెడ్డి, పాలె సాయిని అరెస్టు చేశామన్నారు.logo