సోమవారం 01 జూన్ 2020
Telangana - May 06, 2020 , 22:30:31

కెరమెరి మండలంలో వడగండ్ల వాన

కెరమెరి మండలంలో వడగండ్ల వాన

ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో బుధవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. బాబేఝరి, మహరాజ్‌గూడ, శివగూడ, పాటగూడలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గంట పాటు ఏకధాటిగా పడడడంతో పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు లేచిపోయాయి. పాటగూడలో ఈదురు గాలులకు రేకుపై ఉంచిన రాయి జారిపోయి ఆత్రం గంగారాం మీద పడడంతో తలకు గాయమైంది. వెంటనే వైద్యం కోసం దవాఖానకు తరలించారు. చౌపన్‌గూడ గ్రామ సమీపంలోని ప్రధానరహదారిపై ఓ చెట్టు నేలకొరగడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. మురికిలొంకలో విద్యుత్‌ తీగ తెడిపడి మంటలు విద్యుత్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లోనూ ఈదురుగాలులు బీభీత్సం సృష్టించాయి. సిర్పుర్‌(యు) మండలం గుట్టగూడలో సాయంత్రం వీచినా ఈదురు గాలులకు 25 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఆసిఫాబాద్‌ మండలం మోవడ్‌, వెంకటాపూర్‌ గ్రామాలోని ఇంటిపైకప్పు రేకులు లేచిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. నీళ్లకోసం ఏర్పాటు చేసిన సోలర్‌ ప్లేట్లు ఎగిరిపడ్డాయి. logo