మంగళవారం 02 జూన్ 2020
Telangana - Jan 20, 2020 , 00:53:39

అవకాశాలు అందిపుచ్చుకోవాలి

అవకాశాలు అందిపుచ్చుకోవాలి
  • హ్యాకథాన్‌ ముగింపులో జయేశ్‌రంజన్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా
  • హ్యాకథాన్‌ విజేతగా నిలిచిన ప్రాజెక్టు-డీ బృందానికి రూ.లక్ష బహుమతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నేరాలను తగ్గించడంతోపాటు సమస్యల పరిష్కారంలో టెక్నాలజీని వినియోగించుకోవాలని, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి హ్యాకథాన్‌ వంటి వేదికలు చాలా ఉపయోగపడుతాయని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా అన్నారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 36 గంటల ‘పోలీస్‌ హ్యాకథాన్‌' ఆదివారం సాయంత్రం ముగిసింది. వీ-హబ్‌, ఐఐటీ-హెచ్‌, ట్రిపుల్‌ఐటీ-హెచ్‌, జేఎన్టీయూ సహకారంతో నిర్వహించిన హ్యాకథాన్‌ ముగిం పు కార్యక్రమంలో వారు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. వచ్చే జూలైలో గ్లోబల్‌ హ్యాకథాన్‌ను నిర్వహించనున్నట్టు మై క్రోసాఫ్ట్‌ ఇండియా గరాజ్‌ డైరెక్టర్‌ రీనాదయాల్‌ ప్రకటించారు. హ్యాకథాన్‌లో 99 బృం దాలు పాల్గొనగా.. ప్రాజెక్టు-డీ, లైఫ్‌ ఆఫ్‌ గర్ల్‌, సైబర్‌ నైట్స్‌, బైటానియన్స్‌ టీంలు ఫైనల్స్‌కు చేరాయి. శబ్ధ కాలుష్యాన్ని గుర్తించే అంశంపై ప్రాజెక్టు చేపట్టిన ప్రాజెక్టు-డీ బృందానికి ప్రథ మ బహుమతి కింద రూ.లక్ష అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, వీ-హబ్‌ సీఈవో దీప్తి రావుల,  అదనపు డీజీ శిఖాగోయల్‌, జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు.


logo