మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 16, 2021 , 20:35:10

జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ ఏర్పాటు

జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ ఏర్పాటు

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) త్వరలో వరంగల్‌లోని ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పెట్రోల్‌ బంక్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని మేయర్‌ గుండా ప్రకాష్‌రావు వెల్లడించారు. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరిగింది. సమావేశం సందర్భంగా రూ. 155.11 కోట్ల వ్యయంతో 380 అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్‌రావు మాట్లాడుతూ.. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో 6వ డివిజన్‌లో స్పోర్ట్స్‌ క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్లబ్‌లో షూటర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశానుసారం నగరంలోని ప్రతి ఇంటకి మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రయల్‌ రన్‌ ఫిబ్రవరి 25న జరగనుందని ఏప్రిల్‌ 14 నుంచి నీటి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అత్యవసర వరద ఉపశమనం కింద రూ. 25 కోట్లు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ. 33 కోట్లు, పట్టణ ప్రగతి కింద నెలకు రూ. 7 కోట్లు అదేవిధంగా రూ. 250 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయడానికి మంత్రి కేటీఆర్‌ సుముఖత వ్యక్తి చేసినట్లు పేర్కొన్నారు. 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ గాంధీగా పిలువబడే, స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణ మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జీడబ్ల్యూఎంసీని కోరారు. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఖాజా సిరాజొద్దిన్‌, కమిషనర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కమిషనర్‌ సీహెచ్‌ నాగేశ్వర్‌, ఎస్‌ఈ విద్యాసాగర్‌, సీపీ నర్సింహులు, సీఎంహెచ్‌వో డా. రాజారెడ్డి, సెక్రటరీ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo