సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 02:46:19

ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన

ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. భూ యజమానుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారంనాటికి మొత్తం 3 లక్షల 72 వేల 947 దరఖాస్తులు రాగా.. ప్రభుత్వానికి రూ.37.87 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రామ పంచాయతీల్లో లక్షా 37 వేల 240 దరఖాస్తులు రాగా.. 14.08 కోట్ల ఆదాయం వచ్చింది. మున్సిపాలిటీల్లో లక్షా 51 వేల 940 దరఖాస్తులు రాగా.. 15.33 కోట్ల ఆదాయం, కార్పొరేషన్లలో 83,767 దరఖాస్తులు రాగా, 8.44 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది


logo