గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 10, 2020 , 17:02:48

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన జీవీఎంసీ కమిషనర్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన జీవీఎంసీ కమిషనర్‌

విశాఖపట్నం: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను  గ్రేటర్‌ విశాఖపట్నం కమిషనర్‌ సృజన  స్వీకరించారు. ఇందులో భాగంగా జారిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భగా కమిషనర్‌ మాట్లాడుతూ...రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇచ్చిన సవాల్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లు ఆమె పేర్కొన్నారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ పరిధిలో ఉన్న 147 ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కూడా మొక్కలు నాటాలని అధికారులకు కమిషనర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. logo