బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 08, 2020 , 01:48:20

ఉద్యమాన్ని హేళనచేసేలా మోదీ వ్యాఖ్యలు

 ఉద్యమాన్ని హేళనచేసేలా మోదీ వ్యాఖ్యలు
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి


హైదరాబాద్‌/మిర్యాలగూడ, నమస్తే తెలంగాణ: ప్రధాని  మో దీ తెలంగాణ ఉద్యమాన్ని హేళనచేసేలా మాట్లాడటంపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవా రం మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పా ర్లమెంటులో తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని వ్యాఖ్యానించడం మూడుకోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు. తాను ఎంపీగా రాష్ట్ర సాధనకు పోరాడానని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బిల్లుకు మద్దతు తెలిపిందని, నాడు సుష్మాస్వరాజ్‌ తనను తెలంగాణకు చిన్నమ్మగా  ప్రకటించుకున్నారని గుర్తుచేశారు. ఇకనైనా తెలంగాణ ప్రజలను గౌరవించాలని కోరారు. 


మోదీ తెలంగాణ వ్యతిరేకి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ 

ప్రధాని వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. మోదీ తెలంగాణకు వ్యతిరేకమని మరోసారి స్పష్టమైందన్నారు. బలవంతంగా రాష్ట్రాన్ని ఇచ్చారనే రీతిలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయ ని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక కమిటీల ద్వారా సమగ్ర చర్చ జరిపి, అన్ని జాతీయ పార్టీలు అంగీకరించాయని..  పదేపదే తెలంగాణ ఉనికిని అవమానపరిచేలా మోదీ వ్యాఖ్యలు చేయడాన్ని సీపీఐ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.  
logo