శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 01:12:01

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన గుత్తా, పోచారం

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన గుత్తా, పోచారం

హైదరాబాద్‌, జనవరి 7 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను గురువారం రాజ్‌భవన్‌లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు ఓం బిర్లా ఇక్కడికి విచ్చేశారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసినవారిలో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు కూడా ఉన్నారు. మరోవైపు, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, ఎంపీలు బండా ప్రకాశ్‌, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు, బోర్లకుంట వెంకటేశ్‌నేత తదితరులు రాజ్‌భవన్‌లో ఓం బిర్లాను కలిసి శాలువాలతో సత్కరించారు.