బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 15:18:11

క‌సితీరా వీచిన గాలులు.. వీడియో

క‌సితీరా వీచిన గాలులు..  వీడియో

హైద‌రాబాద్: ఓ అర‌గంట పాటు హైద‌రాబాద్‌ మ‌హాన‌ర‌గం చిగురుటాకులా వ‌ణికింది. ఇవాళ వ‌ర్షానికి తోడైన ఈదురుగాలులు.. హైద‌రాబాదీల‌కు ద‌డ‌పుట్టించాయి.  మ‌హాశ‌క్తివంత‌మైన ఆ గాలుల‌కు .. ఇంటి పైక‌ప్పుల‌పై ఉన్న సామాన్లు కొట్టుకుపోయాయి.  అల్ప‌పీడ‌న ప్ర‌భావంలో ఇవాళ హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిసింది. ఆ స‌మ‌యంలో వ‌చ్చిన బ‌ల‌మైన ఈదురుగాలులు జ‌నాల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశాయి.  వంద‌ల కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచిన‌ట్లు తెలుస్తోంది.  వాతావ‌ర‌ణ‌శాఖ దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ ఇంత బ‌ల‌మైన గాలులు ఇటీవ‌ల కాలం వీయ‌లేదు.  కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు ఊగిపోయాయి.  

మేఘాల‌న్నీ భూమిపై విరుచుకుప‌డ్డ‌ట్లుగా కొన్ని క్ష‌ణాలు గ‌డిచాయి. అత్యంత బ‌లంగా ఆ వ‌ర్షానికి గాలి తోడుకావ‌డం మ‌రింత బీభ‌త్స వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది.  ప్ర‌కృతి త‌న ప్ర‌కోపాన్ని త‌న‌దైన స్ట‌యిల్లో చూపించింది.  గ‌ట్టిగా వీచిన ఈదురుగాలుల‌కు హైద‌రాబాద్‌లో కొన్ని చోట్ల చెట్లు విరిగిప‌డ్డాయి. చిరు జ‌ల్లుగా స్టార్ట్ అయిన వ‌ర్షం కాస్త.. కొన్ని గ‌డియ‌ల్లోనే మ‌హాభీక‌రంగా మారింది.  తుఫాన్ స‌మ‌యంలో స‌ముద్ర తీరం వ‌ద్ద వీచిన‌ట్లుగా.. హైద‌రాబాద్‌లో ఈదురుగాలులు హ‌డ‌లెత్తించాయి. వాస్త‌వానికి లాక్‌డౌన్ ఆంక్ష‌ల వ‌ల్ల న‌గ‌ర రోడ్ల‌పై జ‌నం లేరు.  శేర్‌లింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, మెహిదీప‌ట్నం, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈదురుగాలులు భారీ న‌ష్టాన్ని మిగిల్చాయి.


logo