గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 00:28:02

బాసరలో ఘనంగా గురుపౌర్ణమి

బాసరలో ఘనంగా గురుపౌర్ణమి

  • అమ్మవారికి 112 కిలోల గంట బహూకరణ

బాసర: నిర్మల్‌ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఏటా మూడ్రోజులపాటు నిర్వహించే వేడుకలను కరోనా కారణంగా ఈసారి ఒక్కరోజుతోనే ముగించేశారు. ఆలయంలో వేద పండితులు, అర్చకులు వేకువ జాము నుంచి చతుర్వేద సహిత సరస్వతీ యాగం, చంఢీ హోమం నిర్వహించారు. వేద మహార్షి ఆలయంలో ఈవో దంపతులు పట్టు వస్ర్తాలను సమర్పించారు. పండితులు వేద ఉపనిషత్తుల పారాయణం చేశారు. కొద్ది మంది భక్తులు, ఆలయ పండితులు మాత్రమే పాల్గొన్నారు. అమ్మవారిని ముథోల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య దర్శించుకున్నారు. కాగా అమ్మవారికి దాదాపు రూ.75 వేల విలువైన 112 కిలోల ఇత్తడి విజయ గంటను ఆలయంలో పూజారిగా పని చేసే రాజేశ్వర్‌ శ్రోతి కుటుంబం విరాళంగా అందించింది.


logo