సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 18:48:33

గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్న.. స్వాత్మానందేంద్ర సరస్వతి

గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్న.. స్వాత్మానందేంద్ర సరస్వతి

మంత్రాలయం : తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ఆదివారం మంత్రాలయంలోనిగురు రాఘవేంద్ర స్వామి మఠాన్ని విశాఖ శారదా పీఠం స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ..ప్రజలు కరొనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో తుంగభద్ర పుష్కరాలు వచ్చాయని..భగవంతుని ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుందన్నారు.  

తుంగభద్ర పుష్కరాలలో స్నానమాచరించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందన్నారు. భక్తాదులు అందరూ మంత్రాలయంలోని గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని పుణ్యస్నానాలు చేయాలన్నారు. అనంతరం పీఠాధిపతి సుబుధీంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల మంత్రాక్షితలు అందజేశారు.