ఆదివారం 07 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 15:41:31

పొలం దున్నుతుండగా గుప్తనిధి లభ్యం !

 పొలం దున్నుతుండగా గుప్తనిధి లభ్యం !

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో రైతుకు గుప్తనిధి దొరికిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రంగనాయకుల గుట్ట వద్ద భూమి చదును చేస్తున్న రైతుకు పురాతన కుండ లభించింది. కుండలో గుప్తనిధి ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం ఆ నోటా.. ఈ నోటా పడి అధికారులకు వరకు వెళ్లింది.

రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పురావస్తుశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ నిర్వహించేందుకు గ్రామానికి చేరుకుంటున్నారు. రైతు నుంచి పూర్తి వివరాలు సేకరించిన తరువాత అన్ని విషయాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo