శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 11:27:55

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గన్‌ మిస్‌ఫైర్‌

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గన్‌ మిస్‌ఫైర్‌

నిర్మల్‌ : కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గన్‌ మిస్‌ ఫైర్‌ అయింది. నిర్మల్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ చేతిలో గన్‌ మిస్‌ ఫైర్‌ అయింది. గన్‌ పేలిన ఘటనలో ప్రాణాపాయం తప్పింది. కానిస్టేబుల్‌ శంకర్‌గౌడ్‌ తుపాకీని శుభ్రం చేస్తుండగా గన్‌ మిస్‌ ఫైర్‌ అయింది. తూటా దూసుకెళ్లడంతో ఛాతీకి స్వల్పగాయమైంది. చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రకి తరలించారు.


logo