ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 11:18:18

మణుగూరు అడవిలో మావోయిస్టులు.. పోలీసుల గాలింపు

మణుగూరు అడవిలో మావోయిస్టులు.. పోలీసుల గాలింపు

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లెపల్లితోగు అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు అక్కడే తమ సామాగ్రి వదిలి తప్పించుకున్నారు. వారికోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.  


logo