బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 01:30:26

సాగులో మరిన్ని స్టార్టప్‌లు రావాలి

సాగులో మరిన్ని స్టార్టప్‌లు రావాలి

  • అగ్రి వర్సిటీ సందర్శనలో గుజరాత్‌ బృందం  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన స్టార్టప్‌లను కనిపెట్టాలని గుజరాత్‌ ఉన్నతాధికారుల బృందం అభిప్రాయపడింది. గురువారం గుజరాత్‌ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అంజూశర్మ, ఉన్నత విద్య సంచాలకుడు ఎం నాగరాజన్‌, గుజరాత్‌ వర్సిటీ వీసీ హిమాంశుపాండ్యాతో కూడిన బృందం జయశంకర్‌ వర్సిటీ సందర్శించింది. వీసీ ప్రవీణ్‌రావుతో సమావేశమైంది. వర్సిటీలో చేపట్టిన కార్యక్రమాలను ప్రవీణ్‌రావు గుజరాత్‌ బృందానికి వివరించారు. ఇటీవలే 11 అగ్రి స్టార్టప్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అనంతరం ఈ బృందం రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన కేంద్రంలోని డ్రోన్‌ ప్రయోగ ప్రదర్శనని పరిశీలించింది. డ్రోన్‌లతో పురుగుమందుల పిచికారీ ప్రయోగాలు చేస్తున్నట్టు వీసీ వివరించారు. గుజరాత్‌కు రావాలని ఆ బృందం వీసీని ఆహ్వానించింది. కార్యక్రమంలో వర్సిటీ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 


logo