శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 03:33:26

గీతా పఠనంతో సన్మార్గం

గీతా పఠనంతో సన్మార్గం

  • మానవాళికి భగవద్గీత మార్గదర్శకం: ఎమ్మెల్సీ కవిత 

త్యాగరాయగానసభ, చిక్కడపల్లి: మానవాళికి భగవద్గీత మార్గదర్శకమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ప్రతి ఒక్కరూ నిత్యం గీతా పఠనం చేయాలని కోరారు. శుక్రవారం గీతాజయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ‘తలరాతలు మార్చే భగవద్గీత సందేశం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్‌ గరికపాటి నరసింహారావుకు ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ కవిత స్వర్ణకంకణం తొడిగారు. అంతకుముందు కవిత మాట్లాడుతూ.. భగవద్గీతలోని ఆధ్యాత్మికమైన అంశాలను తెలుసుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ‘నేను.. నాది’ అనే మమకారాన్ని తొలిగించాలనే సందేశమే భగవద్గీత సారాంశమని గరికపాటి నరసింహారావు చెప్పారు. కరోనా నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలు గొప్పగా ఉన్నాయని కొనియాడారు.   కార్యక్రమంలో ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, త్యాగరాయగానసభ అధ్యక్షుడు వీఎస్‌ జనార్దనమూర్తి, టీఎస్‌బీసీఎల్‌ పూర్వ చైర్మన్‌ దేవీప్రసాద్‌, గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.logo