మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:20:57

గూడ అంజయ్య తల్లి మృతి

గూడ అంజయ్య తల్లి మృతి

దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండ లం లింగాపూర్‌కు చెందిన ప్రముఖ కవి, గాయకుడు దివంగత గూడ అంజయ్య తల్లి గూడ లస్మమ్మ (110) బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందారు.  వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లస్మమ్మ బుధవారం మృతిచెందగా.. పలువురు సంతాపం తెలిపారు. గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.


logo