గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 21, 2021 , 01:02:34

బీచుపల్ల్లిలో పల్లీనూనె ప్లాంట్‌

బీచుపల్ల్లిలో పల్లీనూనె ప్లాంట్‌

ఆయిల్‌ఫెడ్‌ లాభాల్లో 2% సీఎస్‌ఆర్‌కు

ఆయిల్‌పామ్‌ మొక్కల సరఫరా కంపెనీలదే

సాగు లక్ష్యం 8.14లక్షల ఎకరాలు 

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్‌, జనవరి 20, (నమస్తే తెలంగాణ): జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్‌మిల్లులో పల్లీనూనెప్లాంట్‌ ఏ ర్పాటు చేయాలని, అక్కడే ఆయిల్‌పాం పీచు నుంచి ముడి నూనె తీసే ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని  ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయించింది. బుధవారం ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఆయిల్‌ఫెడ్‌ పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ము ఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు మేలు రకాలైన ఆయిల్‌పామ్‌ మొక్కలు సరఫరా చేసే బాధ్య త కంపెనీలదేనని పేర్కొన్నారు. రాబోయే నాలుగేండ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 8కంపెనీలకు 4,61,300 ఎకరాలు కేటాయిస్తూ ఉద్యానవనశాఖ ఒప్పందం కుదుర్చుకున్నదని చెప్పారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చ్‌ మార్గదర్శకాల ప్రకారం కంపెనీలు నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పా రు. కంపెనీలు ఆయిల్‌పామ్‌ సాగులో అనుభవం ఉన్న వ్యవసాయ పట్టభద్రులను ఉద్యోగులుగా నియమించుకోవాలని ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించే సమావేశాలకు తానూ హాజరవుతానని వెల్లడించారు. సమీక్షలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ ఎండీ నిర్మల, ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రామ్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, నాబార్డు, ఎస్‌ఎల్‌బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.  

ఆయిల్‌ఫెడ్‌ బోర్డు నిర్ణయాలివి

ఆయిల్‌ఫెడ్‌కు వచ్చిన లాభాల్లో 2%సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) కింద ఖర్చు చేయాలి.

బీచుపల్లి ఆయిల్‌మిల్లులో పల్లీనూనె ప్లాంటు నెలకొల్పడం.

ఆయిల్‌పాం పీచు నుంచి ముడినూనె తీసే మిల్లు  ఏర్పాటుకు నిర్ణయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 30 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ముడి పామాయిల్‌ శుద్ధి ట్యాంకు ఏర్పాటుకు ఆమోదం.

VIDEOS

తాజావార్తలు


logo