గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 14:40:09

ఉస్మానియా ఆస్ప‌త్రిలో వాన‌నీరు.. ఫ‌స్ట్ ఫ్లోర్‌కు పేషెంట్ల త‌రలింపు

ఉస్మానియా ఆస్ప‌త్రిలో వాన‌నీరు.. ఫ‌స్ట్ ఫ్లోర్‌కు పేషెంట్ల త‌రలింపు

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని ఉస్మానియా ద‌వాఖానాలోని గ్రౌండ్ ఫ్లోర్ వార్డుల నుంచి పేషెంట్ల‌ను త‌ర‌లించారు.  రెండు మెడిక‌ల్ వార్డుల్లో బుధ‌వారం కురిసిన వ‌ర్షం వ‌ల్ల నీరు నిండిపోయింది. అయితే ఇవాళ ఆ వార్డుల్లో ఉన్న పేషెంట్ల‌ను ఫ‌స్ట్ ఫ్లోర్‌కు త‌ర‌లించారు. రోగుల‌ను తొలి అంత‌స్తుకు మార్చిన త‌ర్వాత‌.. హాస్పిట‌ల్, జీఎచ్ఎంసీ సిబ్బంది క‌లిసి వార్డుల‌ను శుభ్రం చేశారు. ఆ త‌ర్వాత ఆ వార్డుల్లో క్రిమిసంహార‌కాల‌ను చ‌ల్లి శానిటైజ్ చేశారు.  అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఇవాళ ఉద‌యం రోగుల‌ను ఫ‌స్ట్ ఫ్లోర్‌కు త‌ర‌లించిన‌ట్లు ఆర్ఎంఓ మొహ‌మ్మ‌ద్ ర‌ఫి తెలిపారు. వార్డుల నుంచి నీటిని తోడేసామ‌ని, స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేంత వ‌ర‌కు మ‌ళ్లీ గ్రౌండ్‌ప్లోర్ వార్డుల‌ను వినియోగించ‌మ‌ని ర‌ఫీ తెలిపారు.  logo