మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 06:58:05

ఇక.. కాలేజీలన్నీ హరితమయం

ఇక.. కాలేజీలన్నీ హరితమయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు పచ్చదనంతో విద్యార్థులకు స్వాగతం పలుకనున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో రెండు లక్షల మొక్కలు నాటాలని ఇంటర్‌ విద్యాకమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ కార్యాచరణ రూపొందించారు. ఈ నెలలో తొలిదశలో పది ఎకరాలకుపైగా స్థలమున్న 15 జూనియర్‌ కాలేజీలను గుర్తించారు. ఆగస్టులో మొదలయ్యే రెండోదశ హరితహారంలో వంద జూనియర్‌ కాలేజీల్లో, సెప్టెంబర్‌లో మిగిలిన అన్ని కాలేజీల్లో మొక్కలు నాటాలని ప్రిన్సిపాళ్లకు కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. 

రాష్ట్రంలో 130కిపైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బొటానికల్‌ గార్డెన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. బాటనీ లెక్చరర్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో  54 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో స్థలాన్నిబట్టి మొక్కలు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


logo