సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 02:42:58

హరిత గ్రీన్‌వాల్‌ ‘రాజీవ్‌ రహదారి’

హరిత గ్రీన్‌వాల్‌ ‘రాజీవ్‌ రహదారి’

  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

గజ్వేల్‌: రాజీవ్‌ రహదారి సిద్దిపేట జిల్లాలో హరిత గ్రీన్‌వాల్‌ను తలపిస్తున్నదని ఆర్ద్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం గజ్వేల్‌లోని ఆర్వీఎం దవాఖానలో 100 పడకల కొవిడ్‌ బ్లాక్‌, ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. కొవిడ్‌పై ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న బాధితుడితో మంత్రి మాట్లాడారు. అనంతరం రాజీవ్‌ రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లను పరిశీలించారు. ములుగు వద్ద ఈజీఎస్‌ ఉపాధి కూలీలతో మాట్లాడారు. జిల్లాలో రాజీవ్‌ రహదారి వంటి మామిడి నుంచి తోటపల్లి వరకు 91 కిలోమీటర్లు రెండు వైపులా చెట్లు ఏపుగా పెరిగి గ్రీన్‌ వాల్‌గా మారాయన్నారు. మంత్రి వెంట మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎప్‌ఢీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.logo