మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 14:18:52

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం : మంత్రి సత్యవతి రాథోడ్‌

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం : మంత్రి సత్యవతి రాథోడ్‌

రంగారెడ్డి : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా నేడు రాష్ట్రమంతటా ఉద్యమంలా మొక్కలు నాటుతున్నామని గిరిజన, మహిళా, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. 6వ విడుత హరితహారంలో భాగంగా రాజేంద్రనగర్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో మంగళవారం ఆమె విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారంలో భాగంగా నేడు గిరిజన విద్యాలయాల్లో 4,60,000 మొక్కలను ఈ ఒక్క రోజే నాటనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఐఏఎస్‌, ఐపీఎస్‌ కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ సర్కిల్‌ను ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 


logo