గురువారం 09 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 12:20:36

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం : మంత్రి హరీశ్‌రావు

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలన్నదే సీఏం కేసీఆర్ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని ములుగు మండలం జప్తి సింగాయపల్లిలో మంత్రి హరీశ్ రావు గ్రామంలో చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు.  జప్తి సింగాయపల్లి గ్రామంలో ఏక కాలంలో 2,500 మొక్కలు నాటారు. మూడేళ్ల కింద చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగుందని చెట్లు సంరక్షించిన గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం క్షీర సాగర్ గ్రామంలో 10 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణకు హరిత హారంలో భాగంగా క్షీర సాగర్ గ్రామంలో మొక్కలు నాటామని, జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా బాగా హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టారని, మొక్కలు నాటడమే కాదు, నాటిన మొక్కలను సంరక్షించడం ముఖ్యమని మంత్రి తెలిపారు. హరిత ఉద్యమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

జిల్లాలోని అన్నీ గ్రామాలలో ఊరురా పల్లె ప్రకృతి వనాలు, ప్రతీ గ్రామంలో డంప్, గ్రేవ్ యార్డులు ఉండాలన్నదే సీఏం కేసీఆర్ గారి లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలో నిర్మించిన డంప్, గ్రేవ్ యార్డులు ప్రజలకు ఉపయోగపడేలా.. వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు క్షీర సాగర్ గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రూ.6 లక్షల వ్యయంతో పల్లె ప్రకృతి వనం, రూ.15 లక్షల వ్యయంతో కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మంత్రి వెంట జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo