గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 17:36:36

రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌..

రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌..

సంగారెడ్డి : ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ, రైల్వే లైన్ సాధన సమితి 18 ఏండ్ల పోరాటం ఫలిస్తున్నది. పటాన్ చెరు -సంగారెడ్డి-జోగిపేట-మెదక్ రైల్వే లైన్ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే రూ.1764 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసిందని జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైల్వే లైన్ సాధన సమితి అధ్యక్షుడు గంగా జోగినాథ్ తెలిపారు.  

తాను రైల్వే లైన్ సాధన సమితి ఏర్పాటు చేసి 18 ఏండ్లుగా ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలంటూ ప్రతి ప్రధానమంత్రి, రైల్వే మంత్రులకు వినతిపత్రాలు సమర్పించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సహకారంతో ఈరైల్వేలైన్ నేటికి కార్యరూపం దాల్చిందన్నారు. రైల్వేలైన్‌ ఏర్పాటు సమంజసమేనంటూ గత ఏడాదిలో సర్వే పనులను సైతం దక్షిణ మధ్య రైల్వే చేపట్టిందన్నారు.

ఇవి కూడా చదవండి..

‘ఆడ ప్రాజెక్టులో పడి చుక్కల దుప్పి మృతి’

బంగారు గడ్డగా తాళ్లగడ్డ : మంత్రి జగదీష్‌రెడ్డి

అనంతగిరి కొండలను కాపాడుకుందాం..

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

VIDEOS

logo