బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 02:08:31

ఆర్థిక పురోగతికి హరితమంత్రం

 ఆర్థిక పురోగతికి హరితమంత్రం

  • సీఐఐ గ్రీన్‌బిల్డింగ్‌ సదస్సు ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశ ఆర్థిక పురోగతిలో హరితావరణం పాత్ర కీలకంగా పనిచేస్తుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వాతావరణానికి అనుగుణంగా సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ప్రారంభమైన సీఐఐ గ్రీన్‌ బిల్డింగ్‌ 18వ వర్చువల్‌ సదస్సులో ఆయన ప్రసంగించా రు. జాతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు తగిన ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సీఐఐ, ఐజీబీసీ (ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌) భవిష్యత్తులో దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సదస్సులో సీఐఐ పూర్వ అధ్యక్షుడు జమ్షెద్‌ గోద్రెజ్‌, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, ఐజీబీసీ చైర్మన్‌ వీ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.