మట్టి లేకుండా నీళ్లతో ఆకుకూరల సాగు భేష్

- పందిరిసాగుతో అధిక లాభాలు
- కూరగాయల సాగులో రాష్ర్టాన్ని నెంబర్ వన్‌గా నిలబెట్టేందుకు ఉద్యానవన శాఖ కృషి
- రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామ్రెడ్డి
- అన్నారం, మంబాపూర్ గ్రామాల్లో సాగు పద్ధతుల పరిశీలన
గుమ్మడిదల, ఫిబ్రవరి 2: హైడ్రోఫోనిక్స్ పద్ధతి ద్వారా తెలంగాణలో ఆకుకూరల సాగు చేయడం అద్భుతమని రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అన్నారంలో తేజాకార్తీక్రెడ్డి రెండెకరాల పాలీహౌస్లో హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో ఆకుకూరల సాగు చేస్తున్న విధానాన్ని కమిషనర్ వెంకట్రాంరెడ్డితోపాటు సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉద్యానవనశాఖ అధికారులు సునీత, భాగ్యలక్ష్మి, సీవోఈ రాజ్‌కుమార్, ఏడీలు కమలాకర్, శృతి, శైలజ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ పాలీహౌస్లో మట్టి లేకుండా సాగు చేస్తున్న పాలకూర, తెల్లతోట కూర, ఎర్ర తోట కూర, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ క్యాబేజీ, రెడ్ క్యాబేజీ, పుండికూర, విదేశీ తోటకూర, బ్రకోలి, బటర్హెడ్, పాక్చయ్, పార్శిలీ వంటి కూరగాయల సాగును పరిశీలించి యువరైతును అభినందించారు. నేలలో సాగు చేసే ఆకుకూరలను మట్టి లేకుండా నీటిలో సాగు చేయడం గొప్పవిషయమన్నారు. అనంతరం యువరైతును కమిషనర్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఆయన వెంట సర్పంచ్ తిరుమలవాసు, జీపీ కార్యదర్శి వినోద్‌కుమార్ ఉన్నారు.
కూరగాయల సాగులో దేశంలో తెలంగాణ నెం-1
దేశంలోనే మంబాపూర్ కూరగాయల సాగులో నంబర్‌వన్‌గా రావడానికి ఉద్యానవనశాఖ కృషి చేస్తున్నదని కమిషనర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. మంబాపూర్లోని గ్రీన్ ఎకర్స్‌లో రైతు హనీఫ్ పందిరి సాగు ద్వారా కాకర పంటను పండిస్తున్నాడు. రైతు హనీఫ్ సాగు చేస్తున్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కూరగాయల సాగు ద్వారా ఎకరాకు రూ.10 లక్షల నికర ఆదాయం వస్తున్నదన్నారు. దేశంలో తెలంగాణ 7వ స్థానంలో ఉండగా, భవిష్యత్‌లో ఒకటి, రెండో స్థానంలోకి వస్తామన్నారు. ఉద్యానవనశాఖ ద్వారా ఏటా రైతులకు రూ. వెయ్యి కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు. రైతులు సాగు చేసిన కూరగాయలను రైతుబజార్లు, బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో, కూరగాయల సేకరణ పద్ధతి ద్వారా విక్రయించవచ్చన్నారు. వేసవిలో కూరగాయల కొరత రాకుండా ఆగస్టు మాసంలో కూరగాయలను సాగు చేసుకోవడంతో మే మాసం వరకు వచ్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే రైతులకు మంచి ఆదాయం వస్తుందన్నారు. 15 ఎకరాల వరి సాగుకు ఎకర పందిరిసాగు సమానమన్నారు. రైతు హనీఫ్ ఎకర కాకర పంట సాగులో 30 టన్నులు తీస్తూ పంటకు రూ.5లక్షల వరకు నికర ఆదాయం గడించడం అభినందనీయమన్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్