గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 20:44:51

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన యాంకర్‌ వింధ్య

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన యాంకర్‌ వింధ్య

హైదరాబాద్‌ : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటేందుకు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌ కుమార్ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గ్రీన్ఇండియా స్ఫూర్తివంతంగా కొనసాగుతోంది. ఇటీవల యాంకర్‌ రవి విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సహచర యాంకర్‌ వింధ్య శనివారం రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటినందుకు గర్వంగా ఉందన్నారు. ఎంపీ సంతోశ్‌ కుమార్‌ ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం తాను ట్విట్టర్లో మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతానని ఆమె తెలిపింది.logo