శుక్రవారం 29 మే 2020
Telangana - Oct 29, 2019 ,

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన రాజీవ్‌ శర్మ

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన రాజీవ్‌ శర్మ

హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు డా. రాజీవ్‌శర్మ ఇవాళ మెట్రోరైల్‌ భవన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను ఆయన ఇవాళ పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాజీవ్‌ శర్మ మాట్లాడుతూ.. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్‌ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నానన్నారు. మూడు విభిన్న జాతులకు చెందిన మొక్కలను మెట్రోరైల్‌ భవన్‌ ఆవరణలో నాటానని ఆయన తెలిపారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ గారికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని ఆయన అన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పర్యావరణంపై అవగాహన సృష్టిస్తుందని ఆయన అన్నారు. నాటిన మొక్కలను జాగ్రత్తగా కాపాడుకుందామని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సూచించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన మరో ముగ్గురు అధికారులను నామినేట్‌ చేశారు. వారిలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆధార్‌ సిన్హ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సెక్రటరీ మెంబర్‌ అనిల్‌ కుమార్‌ ఉన్నారు. రాజీవ్‌ శర్మ విసిరిన సవాలును వారు వెంటనే స్వీకరించడం గమనర్హం. 

logo