Telangana
- Dec 27, 2020 , 22:44:15
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన రఘు మాస్టర్

హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శేఖర్ మాస్టర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి రఘు మాస్టర్ ఆదివారం జూబ్లీహిల్స్ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా మూడు మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పచ్చదనం పెంపునకు కృషి చేయాలని కోరారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజుసుందరం మాస్టర్, రాఘవ లారెన్స్, గాయని ప్రణవి ఆచార్యకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు వృక్ష వేదం పుస్తకాన్ని రఘు మాస్టర్‌కు అందజేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు
MOST READ
TRENDING