బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 17:14:04

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన దేవి నాగవల్లి

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన దేవి నాగవల్లి

హైదరాబాద్‌ :   గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ న్యూస్‌ ప్రజెంటర్‌ దేవి నాగవల్లి ఆదివారం జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాగవల్లి మాట్లాడుతూ.. నటుడు నోయల్‌ సీన్‌ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లు తెలిపారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో పచ్చదనం మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.

ఎంపీ జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అన్నిరాష్ట్రాల ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. సీనియర్‌ సినీనటి మీనా, ఈషా రెబ్బా, అరియానా గ్లోరీ, అల్లరి నరేశ్‌, నవీన్‌ పొలిశెట్టి, యాంకర్‌ ప్రత్యూషలకు గ్రీన్‌ చాలెంజ్‌ విసురుతున్నట్లు చెప్పారు. నాటిన మొక్కలతో ఆమె సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo