గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 20:33:58

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటి నందిత శ్వేత

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటి నందిత శ్వేత

హైదరాబాద్‌ : గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించిన నటి నందిత శ్వేత ఇవాళ గచ్చిబౌలిలో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ గురించి తెలుసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ స్ఫూర్తితో మొక్కలు నాటినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌కు ఆమె అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సినీనటి ఐశ్వర్య రాజేశ్‌, హీరో నిఖిల్, డైరెక్టర్ ప్రశాంత్‌లకు ఆమె చాలెంజ్ విసిరారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo