మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 02, 2020 , 20:17:17

ఆ ముగ్గురికి ఛాలెంజ్ విసిరిన న‌టుడు ప్ర‌దీప్‌!

ఆ ముగ్గురికి ఛాలెంజ్ విసిరిన న‌టుడు ప్ర‌దీప్‌!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించి రంగాల‌తో సంబంధం లేకుండా అంద‌రూ మొక్క‌లు నాటుతు‌న్నారు. ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర్ రెడ్డి విసిరిన‌ ఛాలెంజ్‌ను స్వీక‌రించి న‌టుడు ప్ర‌దీప్ సోమాజిగూడ‌లోని త‌న నివాసంలో మొక్క‌లు నాటారు.

సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన గొప్ప కార్య‌క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రినీ భాగ‌స్వాములు చేసినందుకు కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు ప్ర‌దీప్‌. అయితే ఈ గొప్ప ప‌నికి మ‌రో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. మాజీ ఐ. పి.ఎస్ ఆఫీసర్ జె.డి లక్ష్మి నారాయణ , సింగర్ రోహిత్ , నటుడు సాయికుమార్‌ల‌ను నామినేట్ చేశారు ప్ర‌దీప్‌. ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు. 


logo