శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:27:39

అసెంబ్లీ కార్యదర్శి గ్రీన్‌ చాలెంజ్‌

అసెంబ్లీ కార్యదర్శి  గ్రీన్‌ చాలెంజ్‌

  • అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలునాటిన నరసింహాచార్యులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో భాగంగా అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, శాసనమండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహంను గ్రీన్‌చాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తారని ఆకాంక్షించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌, తనను నామినేట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


logo