e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home తెలంగాణ ఐఐటీఏలో గ్రీన్‌ చాలెంజ్‌

ఐఐటీఏలో గ్రీన్‌ చాలెంజ్‌

మొయినాబాద్‌లో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ ప్రభాకర్‌రావు
హైదరాబాద్‌, జూలై 10 (నమస్తే తెలంగాణ): గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తున్నది. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఐఐటీఏ) ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ సంతోష్‌కుమార్‌, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ ప్రభాకర్‌రావు, డీఐజీ తాప్సీర్‌ ఇక్బాల్‌ హాజరై దాదాపు 150 మంది సిబ్బందితో కలిసి మొక్కలునాటారు. ఈ సందర్భంగా అకాడమీ ఆవరణంలో పచ్చదనం పెంపునకు తీసుకున్న చర్యలను అధికారులు ఎంపీ సంతోష్‌కు వివరించారు. 80 ఎకరాల్లో ఏ సందర్భం వచ్చినా మొక్కలు నాటుతున్నామని, ఇప్పటివరకు 20 వేల మొక్కలు నాటామని తెలిపారు. నీటి నిల్వ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటుచేయడంతో భూగర్భజలాలు పెరిగినట్టు చెప్పారు. అకాడమీ అధికారులు తీసుకున్న చర్యలను ఎంపీ అభినందించారు. మొక్కలు నాటిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారులు శ్రీనివాస్‌, కిషన్‌రావు, కిరణ్‌రావు, భాషా, మాధవరావు, డాక్టర్‌ మధుసూదన్‌, వాసుదేవరెడ్డి, బీవీ రెడ్డి, శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌ కిరణ్‌రాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana