మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 19:29:40

ఎడ్యుకేషన్‌హబ్‌గా తెలంగాణ ఎదిగేందుకు అపార అవకాశాలు: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ఎడ్యుకేషన్‌హబ్‌గా తెలంగాణ ఎదిగేందుకు అపార అవకాశాలు: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌: ఎడ్యుకేషన్‌ హబ్‌గా తెలంగాణ ఎదిగేందుకు అపార అవకాశాలున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజ్‌ పేర్కొన్నారు. నూతన విద్యావిధానం (ఎన్‌పీఈ 2020), కార్యాచరణపై గురువారం ఆమె విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలతో వెబినార్‌ నిర్వహించారు. తమిళిసై మాట్లాడుతూ, ప్రాథమికస్థాయిలో మాతృభాషలో బోధనతో పిల్లల్లో మానసిక వికాసం పెంపొందుతుందన్నారు.

భారతీయ మూలాలను గౌరవించే విద్యావిధానానికి కేంద్ర సర్కారు రూపకల్పన చేసిందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ప్రోత్సహించేలా విద్యావిధానం ఉందన్నారు. సమూల సంస్కరణలతో 21వ శతాబ్దపు విద్యావిధానానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఈ విద్యావిధానంతో భారత్‌ ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలను ప్రపంచ నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే ఎన్‌పీఈ 2020 లక్ష్యమని తెలిపారు. భారత్‌ పునర్వైభవానికి విద్యా నిపుణులు కృషిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.


logo