మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 16:04:42

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

హైదరాబాద్ : జిల్లాలోని ముధోల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో కలిసి పలు సమస్యలను విన్నవించారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో అవసరమున్న చోట అదనపు తరగతి గదులకు నిధులివ్వాలని కోరారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ, మరుగు దొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. కాగా, స్పందించిన మంత్రి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని ఈ మేరకు హామీ ఇచ్చారు.


logo