బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 31, 2020 , 01:13:58

వైభవంగా వసంత పంచమి

వైభవంగా వసంత పంచమి

బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం భక్తజన సంద్రమైంది. గురువారం వసంత పంచ మి వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండుగంటల నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి పుట్టినరోజు కావడంతో అర్చకులు వేద మంత్రోచ్ఛరణాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అక్షరాభ్యాసాలు, ఇతర పూజలు చేయించడంతో ఆల యం కిటకిటలాడింది. సుమారు 40వేల మందికిపైగా భక్తులు దర్శించుకొన్నట్టు ఆలయ అధికారులు చెప్పారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. 

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో..

కాళేశ్వరం(జయశంకర్ భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలోని మహాసరస్వతి అమ్మవారి ఆలయంలోనూ వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.


logo