ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 07:20:43

28 నుంచి గ్రాండ్‌ నర్సరీ మేళా

28 నుంచి గ్రాండ్‌ నర్సరీ మేళా

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మరోసారి గ్రాండ్‌ నర్సరీ మేళాకు సిద్ధమైంది. తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు 9వ ఆలిండియా హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ షో జరుగనున్నది. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా ఆవరణలో ఐదురోజులపాటు నిర్వహించే ఈ మేళాను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారని నిర్వాహకుడు ఖలీద్‌ అహ్మద్‌ జమీర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9నుంచి రాత్రి 9 గంటల వరకు నర్సరీ మేళా ఉంటుందని పేర్కొన్నారు. ఈ దఫా 120స్టాళ్లను ఏర్పాటుచేశామని, ప్రవేశ రుసుం రూ.20 ఉంటుందని ఆయన వెల్లడించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo