గురువారం 28 మే 2020
Telangana - Apr 30, 2020 , 19:51:17

రికార్డు స్థాయిలో నేడు ధాన్యం కొనుగోళ్లు

రికార్డు స్థాయిలో నేడు ధాన్యం కొనుగోళ్లు

హైదరాబాద్‌ : గురువారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేసినట్లు రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 3 లక్షల 32 వేల 697 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 5,817 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 23 లక్షల 90 వేల 649 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం, 1065 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 77 వేల 25 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న, 85 కొనుగోలు కేంద్రాల ద్వారా 67,811 మెట్రిక్‌ టన్నులు శనగలు, 14 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,055 మెట్రిక్‌ టన్నుల పొద్దుతిరుగుడును కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


logo