శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:09:40

ధాన్యం కొనుగోలు అంచనా 75 లక్షల టన్నులు: మంత్రి గంగుల

ధాన్యం కొనుగోలు అంచనా 75 లక్షల టన్నులు: మంత్రి గంగుల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వానకాలం ధాన్యం కొనుగోలుకు అన్నిఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. ప్రతిగ్రామంలో కనీసం ఒక కొనుగోలు కేంద్రం ఉండేలా ఆరువేల కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. గురువారం పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అధికారులు, మిల్లర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్‌లో మొత్తం 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, మొత్తం 98.61 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల టన్నుల దాకా ధాన్యం రావచ్చని, ఆ మేరకు పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలుచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మొత్తం 18.76 కోట్ల గోనెసంచులు అవసరమవుతాయని,ఇందులో పాతవి 8.63 కోట్లు ఉండగా కొత్తగా 10.13 కోట్లు సమకూర్చాలన్నారు.