సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 17:23:29

వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

వికారాబాద్‌ రూరల్‌ : వానకాలం పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైనందున జిల్లాలో వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయాధికారులు, మార్డ్‌ఫెడ్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా సుమారు 144 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఎక్కడ కూడా అవినీతికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, వ్యవసాయాధికారులు, మార్క్‌ఫెడ్‌ అధికారులు పాల్గొన్నారు. 


logo