మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 18:40:53

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలి

మేడ్చల్ మల్కాజిగిరి : అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా చైతన్య పరిచేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్ మండల పరిధి అవుషాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామంలో పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకునేందుకు ఇచ్చిన దరఖాస్తులను మంత్రి మల్లారెడ్డికి ఆయన నివాసంలో అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పడుతున్నట్లు తెలిపారు. రానున్న హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచేలా పార్టీ నాయకలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. 


logo