బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:29

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హన్మకొండ: త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రతి పట్టభద్రుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం హన్మకొండలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నివాసంలో కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌, కేయూ పార్ట్‌టైం లెక్చరర్స్‌ అసోసియేషన్‌, అకుట్‌ (అసోసియేషన్‌ ఆఫ్‌ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్‌) ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత విలువైందన్నారు. ఓటు వేయడాన్ని హక్కుగా భావించి ప్రతి పట్టభద్రుడు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు లాల్‌బహుదూర్‌ కళాశాలలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.