శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Feb 23, 2021 , 15:33:16

ముగిసిన గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు

ముగిసిన గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు

హైదరాబాద్‌ : గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌, మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు రేపు పరిశీలించనున్నరు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహణ జరగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. 

VIDEOS

logo